Saturday, September 17, 2022

Productivity Laws for Individual Excellence

I'm listing some productivity laws, which will help in excelling at studies or work. These doesn't include leadership related topics, which will be dealt separately. This is just listing, if you are interested in any specific law, please find more on google or youtube.

  • Parkinson’s Law

    • Work expands to fill the time given for it’s completion

    • Corollary: the more time a task is given, the harder it will become.)

    • Kabir - Kal kare so aaj kar

  • Pareto Principle or 20-80 Rule(Pareto principle in economy) Eg. 80% marks come from 20% syllabus.

  • Prioritise

  • Focus and intensity: Do one thing at a time. Avoid multi tasking - doing many things simultaneously eg. Eating while reading or while chatting on mobile.

  • Power of Compounding : Small steps done consistently, for extended period of time will yield significant results

  • Use it or lose it : body and mind powers.

  • Don’t be – ‘penny wise and pounds foolish’ and don’t sweat small stuff.

  • Stress management : Be in harmony with nature(wake up before sunrise, sleep early after sunset), socialise.

  • Power of discipline, routine and ritual.

  • Sharpen your axe before cutting trees(Develop your skill through training in particular area/field, if you have to work in that area for long time). Eg. learn MS Office or programming if you are going to work in Computers.

  • Important decisions in life should be taken after due deliberation after weighing all options, as they lay strong foundation, set our future course and make you. There is no point in landing at wrong place and struggling there. You have to take charge of your decisions and their consequences. When you pick one end of stick, other end automatically follows. Right decisions will save lot of your time and energy, and give you peace of mind. Eg. Which school to join, which college to join for 10+2 and graduation, which profession to choose, which life partner to choose etc.

  • Learning by doing: Teach to others, if you have to master a subject.

  • Seeing is believing: Do simple experiments, or visit places physically.

Friday, April 29, 2022

Obtaining OBC Non Creamy layer Certificate(This is different from caste certificate)

 బి.సీ.లు - ఓబీసీ (నాన్ - క్రిమిలేయర్ ) సర్టిఫికెట్ పొందడం ఎలా ? 

- వెంకటకిషన్ ఇట్యాల

తహసీల్ధార్ , జన్నారం మండలం , మంచిర్యాల్ జిల్లా 

9908198484 


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేసి భర్తీ చేయబోతున్నందున మరియు వచ్చే 2022 - 23 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నందున అర్హులైన బీసీ అభ్యర్ధులు రాష్ట్ర స్థాయిలో నాన్ - క్రిమిలేయర్ సర్టిఫికేట్ ని మరియు సెంట్రల్  లెవెల్ జాబ్స్ మరియు విద్యా  సంస్థలలో ప్రవేశం కోసం OBC సర్టిఫికెట్ ని సులభంగా పొందడం కోసం మరియు వారికి గానీ జారీ చేసే అధికార యంత్రాంగానికి గానీ ఉండే పలు అనుమానాల నివృత్తి కోసం. 


        వెనుకబడిన తరగతులకు (OBC ) మన రాష్ట్రస్థాయిలో (పూర్వపు AP) రిజర్వేషన్ సౌకర్యమును (25%) 1970వ సం॥లో జీ.ఓ.యం.యస్ . నెం . 1793 ద్వారా  , కేంద్రస్థాయిలో మండల్ కమీషన్ సిఫారసుల మేరకు (27%) 1993 వ సం ॥ నుండి మాత్రమే కల్పించబడినది . కానీ , ఈ  ( OBC ) రిజర్వేషన్లు అమలు చేయుటకు వారిలోని క్రీమీలేయర్ ( సంపన్నశ్రేణి ) ను మినహాయించాలని సుప్రీం కోర్టు ఇందిరా సహానీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును వెలువరించింది . సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఇతర వెనుకబడిన తరగతులలో క్రీమీలేయర్ ( సంపన్నశ్రేణి ) ను గుర్తించుటకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని వేయడం జరిగినది . ఆ కమిటీ చేసిన సూచనల మేరకు వెనుకబడిన తరగతులలో క్రీమీలేయర్ ( సంపన్నశ్రేణి ) ను గుర్తించడం జరుగుతుంది . 


  సంపన్నశ్రేణీ క్రీమీలేయర్ ) అనగానేమి ? 


        వెనుకబడిన తరగతులకు చెందిన వారిలో సామాజికంగా , విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారిని ' సంపన్నశ్రేణి ' ( క్రీమీలేయర్ ) గా పరిగణిస్తారు . 


      సంపన్నశ్రేణి ( క్రీమీలేయర్ ) కి చెందినవారికి రిజర్వేషన్ సౌకర్యం వర్తిస్తుందా ? 


                సంపన్నశ్రేణికి చెందినవారు వెనుకబడిన తరగతులకు చెందినప్పటికీ , వారు సామాజికంగా , విద్యాపరంగా అభివృద్ధి చెందినవారైనందున రిజర్వేషన్ సౌకర్యమును పొందుటకు అనర్హులు . వారు ఓపెన్ కేటగిరీలో మాత్రమే పోటీపడవలసి ఉంటుంది . 


సంపన్నశ్రేణిని ( క్రీమీలేయర్ ) గుర్తించడమెలా ?


       కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చేయబడిన సూచనల ప్రకారం వెనుకబడిన తరగతులలోని సంపన్నశ్రేణిని ఈ క్రింద తెలియజేయబడిన విధంగా గుర్తిస్తారు . 


1. రాజ్యాంగంలో పొందుపరచబడిన పోస్టులలో ఉన్నవారి పిల్లలు :


        రాజ్యాంగంలో పొందుపరచబడి క్రింద తెలియజేయబడిన పోస్టులలో ఉన్న వారి పిల్లలు క్రీమీలేయర్ ( సంపన్నశ్రేణి ) గా పరిగణించబడతారు .


         i ) రాష్ట్రపతి ii ) ఉపరాష్ట్రపతి iii ) సుప్రీంకోర్టు , హైకోర్టు మరియు పరిపాలన ట్రిబ్యునల్ న్యాయమూర్తులు iv ) UPSC & PSC అధ్యక్షులు మరియు సభ్యులు ) v ) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ( CEC ) vii ) కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( CAG ) vii ) అటార్నీ జనరల్ మరియు అడ్వకేట్ జనరల్ viii ) అధికార భాషా సంఘ సభ్యులు ix ) కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు , MP , MLA & MLC లు , ఎగువ చట్టసభల ఛైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్లు x)  రాజ్యాంగంలో పొందుపరచబడిన ఇతర పోస్టులలో ఉన్నవారు .


    II . సివిల్ ఉద్యోగులు :


 క్రింద తెలియజేయబడిన కేటగిరీలకు చెందిన సివిల్ ఉద్యోగుల పిల్లలు క్రీమీలేయర్ ( సంపన్నశ్రేణి ) గా పరిగణించబడతారు .


      1. తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా ఆల్ ఇండియా సర్వీసులలో ( IAS , IPS & IFS ) డైరెక్టుగా నియామకం పొందినవారు . 


    2. తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా గ్రూప్ -1 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు .


     3. తల్లిదండ్రులిరువురూ గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు . 


     4. తల్లిండ్రులలో ఏ ఒక్కరైనా గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం కాబడి , 40 సం॥ల లోపు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినవారు . 40 సం || ల తర్వాత గ్రూప్ -1 స్థాయికి ప్రమోషన్ పొందినట్లైతే వారి పిల్లలు  క్రీమీలేయర్ కింద రారు. 


       5.)   తల్లిదండ్రులిద్దరు  లేదా ఒక్కరైనా గ్రూప్ -3 లేక గ్రూప్ -4 స్థాయిలో తొలుత నియామకం పొంది వారు ప్రమోషన్ ద్వారా ఏ స్థాయికి చేరినా గానీ వారి పిల్లలు ఎట్టి పరిస్థితులలోనూ సంపన్నశ్రేణిగా పరిగణించబడరు . 


       సివిల్ ఉద్యోగుల విషయంలో ముఖ్యంగా గమనించవలసిన అంశమేమిటంటే వారు తొలుత నియామకం పొందిన స్థాయిని బట్టి వారి పిల్లలు సంపన్నశ్రేణి కిందకు వస్తారా ? రారా ? అన్న విషయం నిర్ణయించబడుతుంది . అంతేకానీ , వారు ప్రస్తుతం పొందు జీతభత్యములను బట్టి మాత్రం కాదు . 


        ఇచ్చట గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన అంశమేమంటే , ఉద్యోగులు అనగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు మాత్రమే . ప్రైవేటు సంస్థలలో పనిచేయు ఉద్యోగులు ఈ కేటగిరీ క్రిందకు రారు .


           III . మిలిటరీ మరియు పారామిలిటరీ దళాలు :


 మిలిటరీ ( Army , Navy & Air Force ) మరియు పారా మిలిటరీ పనిచేయుచున్న తల్లిదండ్రులలో ఏ ' ఒక్కరు గానీ లేక ఇద్దరూ ' కల్నల్ ' స్థాయి ఉద్యోగంలో యున్న యెడల వారి పిల్లలు సంపన్నశ్రేణిగా . గుర్తించబడతారు . ఆ తక్కువ స్థాయిలో ఉన్నవారికి సంపన్నశ్రేణి వర్తించదు .


     IV . ప్రొఫెషనల్స్ , వాణిజ్య మరియు వ్యాపార వర్గాలు :


   ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లు , ఇంజనీర్లు , లాయర్లు , చార్టర్డ్ అకౌంటెంట్లు , ఇన్కంటాక్స్ కన్సల్టెంట్లు , ఆర్కిటెక్టులు , కంప్యూటర్ ప్రొఫెషనల్స్ , సినీ ఆర్టిస్టులు , రచయితలు , జర్నలిస్టులు , క్రీడాకారులు మొదలగువారు . వారి ఆదాయాన్ని బట్టి సంపన్నశ్రేణిగా గుర్తించబడతారు . అనగా , మూడు సంవత్సరాల పాటు వరుసగా వారి వార్షికాదాయం నిర్దేశించబడిన ఆదాయ పరిమితిని దాటితే అట్టి వారి పిల్లలు ' సంపన్నశ్రేణి'గా గుర్తించబడతారు . ప్రస్తుతం కేంధ్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన వార్షికాదాయ పరిమితి రూ .8.00 లక్షలు .


  V. ఆస్తిపరులు : 


ఎ ) వ్యవసాయ భూమి : 


i ) సాగునీటి సౌకర్యం కలిగి , Land Ceiling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో 85 % భూమి ఉన్న యెడల , వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు .


 ii ) ఉన్న భూమిలో కొంత సాగునీటి సౌకర్యం కలది , కొంత సాగునీటి సౌకర్యం లేనిది అయిన యెడల , సాగునీటి సౌకర్యం గల భూమి Land Ceiling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో కనీసం 40 % కంటే ఎక్కువగా ఉన్నప్పుడే , మిగతా మెట్ట భూమిని కన్వర్షన్ ఫార్ములా ప్రకారం సాగునీటి భూమిగా మార్చి , రెంటినీ కలిపి చూసి , Land Ceiling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో 80 % కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అట్టి వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు .


iii ) ఒకవేళ ఉన్న భూమి అంతా మెట్టభూమియే అయినప్పుడు , ఎంత భూమి ఉన్నప్పటికీ వారి పిల్లలు సంపన్నశ్రేణిగా పరిగణించబడరు .


          ఇచ్చట గుర్తించవలసిన ముఖ్యమైన అంశమేమనగా , భూమి పరిమాణమును బట్టి మాత్రమే సంపన్నశ్రేణి  నిర్ణయిస్తారు . ఆ భూమి ద్వారా వచ్చు ఆదాయంతో ఏ మాత్రం సంబంధం లేదు . ఉండవలసిన భూపరిమాణం కంటే తక్కువగా భూమిని కలిగి , ఆ భూమి ద్వారా వచ్చు ఆదాయం సంపన్నశ్రేణి ఆదాయ పరిమితి కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ , అట్టి వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణించరాదు . 


బి ) ) మామిడి , బత్తాయి , నిమ్మ మొ || తోటలు : 


ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక పైన తెలియజేయబడిన తోటలైనచో , వీటిని మామూలు సాగునీటి పారుదల గల వ్యవసాయ భూమిగా గుర్తించడం జరుగుతుంది . అంటే , Land Ceiling Act ప్రకారం 85 % కంటే ఎక్కువగా భూమిని కలిగి , ఆ భూమిలో పైన తెలిపిన తోటలు ఉన్న యెడల , అట్టివారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణించబడటం జరుగుతుంది . 


ii ) కాఫీ , టీ , రబ్బరు మొ.. తోటలు 

ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక పైన తెలియజేయబడిన తోటలైనచో , వాటిపై వచ్చు ఆదాయమును క్రీమీలేయర్ నిర్ణయం జరుగుతుంది . అనగా , పైన తెలియజేయబడిన విధముగా నిర్దేశించబడిన ఆదాయ పరిమితి కన్నా మించిన ఆదాయమును మూడు సం॥లు వరుసగా పొందిన యెడల , అట్టివారి పిల్లలు క్రీమీలేయర్ పరిగణించబడతారు . 


సి ) పట్టణాలలో ఖాళీ స్థలం / భవనములు : Wealth Tax వర్తింపజేయబడి , పరిమితికి మించిన ఆస్తిని కలిగిన వారి పిల్లలు సంపన్నశ్రేణిగా పరిగణించబడతారు . 


 క్రీమీలేయర్ అంశాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరికొన్ని వివరణలు : 


1 ) క్రీమీలేయర్ అంశం ప్రస్తుతం ఉద్యోగాలకు , విద్యాసంస్థల్లో ప్రవేశానికి మాత్రమే వర్తింపజేయాలి . 


2 ) ఉద్యోగుల విషయంలో క్రీమీలేయర్ ను  వారు తొలుత నియామకం పొందిన ఉద్యోగ స్థాయిని బట్టి మాత్రమే నిర్ణయిస్తారు . వారు పొందు జీతభత్యాలతో ఏ మాత్రం సంబంధం లేదు .


    3 ) ఒక్కొక్కసారి కొందరు ఉద్యోగులకు కొంత వ్యవసాయ భూమి కూడా వుండవచ్చు . అట్టి పరిస్థితులలో వారు క్రీమీలేయరు క్రిందకు వస్తారా ? రారా ? అన్న విషయాన్ని వేరువేరుగా పరిశీలించాలి . ఒకవేళ , వారి తొలి ఉద్యోగ నియామకపు స్టేటస్ ను బట్టి క్రీమీలేయరు క్రిందకు రాని వారు వారికున్న వ్యవసాయ భూపరిమితిని బట్టి క్రీమీలేయరు క్రిందకు రావచ్చు . వ్యవసాయ భూమి విషయంలో పైన తెలియజేసిన విధంగా ఎంత పరిమాణం ఉన్నది అన్నదే ముఖ్యంగానీ , ఆ భూమి ద్వారా ఎంత ఆదాయం వస్తున్నదని కాదు .ఏదైనా ఒక దానిలో మాత్రమే చూడాలి. అంతే కానీ  జీతభత్యాలను మరియు  వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపి క్రీమీలేయర్ ని నిర్ణయించరాదు .


4 ) జీతభత్యాలు , వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయము కాక ఇతర సేవలు లేక వ్యాపారం లేక వాణిజ్యం లాంటి ఇతర రంగాల ద్వారా ఆదాయాన్ని పొందుచున్న యెడల , ఇతర రంగాల ద్వారా పొందు ఆదాయం క్రిమీలేయర్ పరిగణనకు ఉండవలసిన ఆదాయాన్ని మించిన యెడల , అప్పుడే వారి పిల్లలు శ్రీమీలేయర్ గా  పరిగణించబడతారు . 


5) వివిధ సేవా వృత్తుల ద్వారా మరియు వ్యాపార , వాణిజ్య రంగాల ద్వారా ఆదాయం పొందుచున్న వారికి మాత్రమే ఆదాయ పరిమితి  వర్తింపజేసి , క్రీమీలేయర్ క్రిందకు వస్తారా ? రారా ? నిర్ణయించాలి . 


   6 ) ఎవరైనా కొందరు ఉద్యోగులు కొంత వ్యవసాయ భూమితో పాటు ఇతర రంగాల నుండి కూడా ఆదాయాన్ని పొందుచున్నప్పుడు వారికి ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని బట్టి మాత్రమే వారి క్రీమీలేయర్ స్టేటస్ ను నిర్ణయించాలి . అంతేకానీ , వేర్వేరు రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపి చూపి క్రీమీలేయర్ స్టేటన్ ను  నిర్ణయించరాదు .


   7 ) కొందరు Land Ceiling Act ప్రకారం వుండవలసిన భూమిలో 85 % కన్నా తక్కువ భూమి వున్నందువలన , ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయం ఆదాయ పరిమితి కన్నా తక్కువగా వున్నందువలన క్రీమీలేయరు క్రిందకు రాక పోయినప్పటికీ , వారికి పట్టణాలలో వున్న సంపదను బట్టి వారు క్రీమీలేయరు క్రిందకు వచ్చు అవకాశం కలదు . ఇది ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది . 


8 ) ఒక వ్యక్తి క్రీమీలేయర్ స్టేటస్ తన తల్లిదండ్రుల స్టేటస్ ను బట్టి మాత్రమే నిర్ణయించాలి . తన స్టేటస్ తో సంబంధం లేదు . అనగా ఎవరైనా గ్రూప్ -1 స్థాయి ఉద్యోగమునకు ఎంపిక కాబడి , మళ్ళీ గ్రూప్ -1 స్థాయిలోనే ఉన్న మరో ఉద్యోగము కొరకు గ్రూప్ -1 పరీక్షలకు గానీ , సివిల్ సర్వీసు పరీక్షలకు గానీ ప్రయత్నం చేసినప్పుడు , అతని స్టేటస్ ను బట్టి అతన్ని క్రీమీలేయర్ గా  పరిగణించరాదు . అలాగే స్త్రీల విషయంలో ఆమె తల్లిదండ్రుల స్టేటస్ ను బట్టి క్రీమీలేయర్ స్టేటస్ ని  నిర్ణయించాలే గానీ , ఆమె భర్త స్టేటస్ ను బట్టి కాదు . 


       పై వివరణలను బట్టి క్రీమీలేయరు ఎవరెవరికి వర్తిస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు . ఇది అందరు ఉద్యోగులకు వారి జీతభత్యాలను బట్టి వర్తిస్తుంది అని అనుకోవడం సరికాదు . ( 1 ) ఒక ఉద్యోగి తొలి నియామకపు స్టేటస్ ( ii ) ఉన్న భూమి యొక్క పరిమాణం ( iii ) ప్రైవేట్ సేవలు లేక వ్యాపారం లేక వాణిజ్య రంగాల ద్వారా వచ్చు ఆదాయ మరియు పట్టణాలలో ఉన్న ఆ ద్వారా వచ్చు ఆదాయం ( iv ) సంపద పన్ను చట్టం ప్రకారం పన్ను చెల్లించడం లాంటి వాటిని విడివిడిగా పరిగణనలోకి తీసుకొని , ఏ కేటగిరి క్రింద క్రీమీలేయర్ గా పరిగణించబడతారో స్పష్టంగా నిర్ణయించాలి . ఏ కేటగిరి క్రిందనూ క్రీమీలేయర్ పరిగణించబడడానికి వీలులేనప్పుడు అట్టి వారి పిల్లలు క్రీమీలేయర్ క్రిందకు రారు . వేరువేరు కేటగిరీల క్రింద పొందు ఆదాయాన్ని కలిపి చూడరాదు . అలా కలిపి చూసి , క్రీమీలేయర్ స్టేటస్ ను నిర్ణయించరాదు .


- వెంకటకిషన్ ఇట్యాల 

9908198484

Sunday, January 9, 2022

Some useful videos on youtube for Civil Service Exam

Discovery of India(Bharat Ek Khoj) Jawaharlal Nehru, Directed by Shyam Benagal 

(This is history of india - ancient to modern. You can watch selectively if the list is long)

https://youtube.com/playlist?list=PLqtVCj5iilH4w0Y8KBB4fqBu25T0sGhXG


Making of Indian Constitution (Samvidhaan) 

Directed by Shyam Benagal

https://youtube.com/playlist?list=PLAa8vphOlKtCIgxQ5E0abnO_esick1qYn


Justice by Michel Sandel (For ethics and essay papers)

https://youtube.com/playlist?list=PL30C13C91CFFEFEA6


General Science (Physics, Chemistry, Biology), Geography and Biographies

Makemegenius Youtube Channel. See other videos as well from this channel.

https://youtube.com/playlist?list=PL3A11E3745F6F71FE


Modern History by Seenaiah sir

https://www.youtube.com/playlist?list=PLaCcEBBNTuef7ufkywMLrqm3fKZMrkc1u

or

https://www.youtube.com/watch?v=lMwRSj-S-F0



Note: There are many videos on youtube, but finding right videos which are comprehensive and brief is a difficult task. Many a times, we end up wasting lot of our time, gaining nothing much and not remembering what we heard/watched, leading to frustration. I suggest that you spend(or invest) some time in gathering good printed material - NCERT/State Books for Social Studies and General science, Govt publications like India Year book, Economic Suvery, Budget documents, photo copies of class notes from good lecturers, printed material from coaching institutes, books from some renowned private publications suggested by toppers etc.  in this order. Use internet and youtube only for latest topics like Science and Technology, Economy etc. which you don't find in conventional books.